వివాహేతర సంబంధం పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అక్రమ సంబంధం ద్వారా అన్నిసందర్భాలలో భార్యపై క్రూరత్వం కాబోదని కోర్టు అభిప్రాయపడింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తుంటే, అతడి భార్యను ఆత్మహత్యకు పురిగొల్పినట్టేనన్న వాదనను న్యాయమూర్తులు తొసిపుచ్చారు. గుజరాత్ కు చెందిన ఓ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్న అనంతరం భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకోవటంతో కలత చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. దీంతో ట్రయల్ కోర్టు, హైకోర్టు నిందితుడిని దోషిగా తేల్చాయి. కేసును విచారించిన జస్టిస్ ఎస్.జే.ముఖోపాధ్యాయ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ విచారించింది. ఈ కేసులో వరకట్న వేధింపులు లేవని, నిందితుడికి అక్రమ సంబధమున్నట్లు సరైన ఆధారాలను చూపలేకపోయారని బెంచ్ పేర్కొంది. ఇలాంటి సందర్భం అసలు సెక్షన్ 498-ఏ కిందకు వస్తుందా అని పిటిషనర్ ను ప్రశ్నించింది. అక్కమ సంబంధం చట్టవ్యతిరేకం, అనైతికమైనప్పటికీ అన్ని సందర్భాలలో దాన్ని క్రూరత్వం కింద పరిగణించలేమని స్పష్టం చేసింది.