కోర్టుల్లో సొంతంగా కేసులను వాదించుకునేప్పుడు భావోద్వేగాలను, అదుపులో ఉంచుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సొంతంగా వాదించుకునేప్పుడు మీ ఏడుపులు మమ్మల్ని ప్రభావితం చేయలేవు, మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు అన్నారు. కేసులను స్వయంగా వాదించుకునేవారు కొన్ని సందర్భాలలో భావోద్వేగాలకు గురవుతూ కోర్టు బోనులోనే బోరున విలపిస్తున్న సందర్భాలపై ఆయన మరో న్యాయమూర్తి ఎస్కే సిక్రీతో కలిసి పైవిధంగా వ్యాఖ్యానించారు. కోర్టులో కేసుల వాదన సందర్భంగా ఇకపై భావోద్వేగాలకు లోనుకావటం తగదని వారు తేల్చి చెప్పారు.