త్వరలో ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించింది.ఈ మేరకు ఈ ప్రతిపాదనపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలన చేపట్టింది. మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ తన అధ్యక్షతన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఒకటికి రెండుసార్లు పేర్ల నమోదు, ఓటర్ల నమోదులో తప్పులు తదితరాలను నివారించడం ఈ ప్రతిపాదన ఆంతర్యం. ఈ దిశగా ఆధార్ మాత్రమేగాక జాతీయ జనాభా రిజిస్టర్ సమాచారంతోనూ సరిపోల్చాలన్న ప్రతిపాదన కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో సదరు ప్రక్రియకు త్వరలోనే తుదిరూపు ఇచ్చే అవకాశాలున్నాయని కమిషన్ వర్గాలు తెలిపాయి.