ఎమ్మెల్యే అతి: కుక్కకి డయాలసిస్ చేయలేదని వేటు

June 25, 2015 | 06:06 PM | 1 Views
ప్రింట్ కామెంట్
TMC_MLA_nirmal_maji_dog_doctor_niharonline

ప్రేమగా చూసుకునే పెంపుడు జంతువులకు అనారోగ్యం వస్తే ఎవరైనా తల్లడిల్లిపోతారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తారు. మరి అది ఓ ఎమ్మెల్యే గారి కుక్క అయిపాయే. మరి ఇక అది అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన ఊరుకుంటారా?. ఏకంగా మనుషుల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వివరాళ్లోకి వెళ్లితే... పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్ నిర్మల్ మజీ పెంపుడు కుక్కకి జబ్బుచేసిందట. అయితే ఏకంగా ప్రభుత్వాసుపత్రికే తీసుకొచ్చిన ఆయన తన కుక్కకు డయాలసిస్ చేయాలని అక్కడి వైద్యులను ఆదేశించారట. అసలే ఎమ్మెల్యే కదా, వైద్యులు కూడా దానికి డయాలసిస్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆస్పత్రి డైరెక్టర్, చీఫ్ డాక్టర్ అయిన ప్రదీప్ మిత్రా మాత్రం దీనికి అంగీకరించలేదు. మనుషుల ఆస్పత్రిలో పశువులకు డయాలసిస్ ఏంటని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా?. వెంటనే ఆ వైద్యుడిపై వేటు వేయించారు సదరు ఎమ్మెల్యేగారు. ముప్పై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తనపై ఇలా అవమానకరరీతిలో వేటు వేయటం బాధిస్తుందని ఆ వైద్యుడు చెబుతున్నాడు. దీనిపై ఎమ్మెల్యేని ప్రశ్నించగా, తొలుత కుక్కకు డయాలసిస్ చేస్తే తప్పేంటని చెప్పిన ఆయన, తర్వాత అసలు తనకు కుక్కే లేదని మాట మార్చి చెబుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ