ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేట్ చేయడంతో సల్మాన్ ఖాన్ ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో చురుకుగా పాల్పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తూ తూ మంత్రంగా కాకుండా దీన్ని సీరియస్ గా తీసుకుని పని చేయాలని సంకల్పించారు సల్మాన్. ‘‘నన్ను గౌరవ ప్రధాని స్వచ్ఛభారత్ కు నామినేట్ చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని మూడు గ్రామాల్లో కొన్ని ఇళ్ళ వద్ద శుభ్రం చేసి, రంగులు వేశాను. ఈ కార్య క్రమం ఒక్కరి వల్ల అయ్యేది కాదు. అందుకే ఫిబ్రవరి 26 నుంచి నేను ప్రతి నెల 100 మందిని స్వచ్ఛభారత్ కు నామినేట్ చేస్తాను. దయచేసి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇంటి వద్ద, మిగతా అన్ని చోట్లా సరైన విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించండి. స్వచ్ఛ భారత్ ముందు, తర్వాత ఫోటోలు, వీడియోలు నాకు పంపండి. బాగా చేసిన ఐదుగురిని ఎంపిక చేసి, నా ఫేస్ బుక్ పేజీలో వారి గురించిన వివరాలు వెల్లడించడంతో పాటు బహుమతి అందజేస్తాను’’ అని సల్మాన్ ఖాన్ తన ఎఫ్ బిలో పోస్ట్ చేశాడు. సల్మాన్ ఖాన్ నుండి ప్రశంసలు, బహుమతులు అందుకోవాలన్నా, మన భారత్ ను స్వచ్ఛభారత్ గా తీర్చి దిద్దాలన్నా అందరూ సల్మాన్ తో చేయి కలపండి.