క్యా బాత్ హై: బరాక్ నోట బాద్ షా మాట

January 27, 2015 | 03:08 PM | 30 Views
ప్రింట్ కామెంట్

భారత పర్యటనలో చివరిరోజు ఢిల్లీలోని సిరిఫోర్ట్ అడిటోరియంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా... యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులతో కనెక్ట్ అయ్యేందుకు బాలీవుడ్ మార్గాన్ని ఎంచుకున్నారు. తన తొలి రెండు నిమిషాల ప్రసంగంలో దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రంలోని పాపులర్ డైలాగ్ ప్రస్తావించారు ‘సెనోరీటా... బడే బడే దేశోం మే’ అన్న డైలాగ్ ఒబామా నోటి నుంచి జాలువారింది. మొదట హిందీలో నమస్తే... ధన్యవాద్ అంటూ మొదలుపెట్టిన ఆయన, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, క్రీడాకారుడు మిల్కాసింగ్, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ పేర్లను తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఒంటి రంగు లేదా ఆరాధన ఆధారంగా కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు షారూక్, మేరీకోమ్, మిల్కా సింగ్ ల విజయాన్ని సమానంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఒబామా పేర్కొన్నాడు. ఆయన మాట్లాడటం ముగిసిన వెంటనే లగాన్ చిత్రంలోని ఓ మితువా.. సున్ మితువా పాటను ప్లే చేశారు. కాగా, మూడు రోజుల పర్యటన ముగియటంతో మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ నుంచి సతీసమేతంగా సౌదీ కి పయనమయ్యారు ఒబామా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ