గురువు గుర్తుపెట్టుకుని కన్నీళ్లు తుడిచిన మేధావి

July 20, 2015 | 04:45 PM | 3 Views
ప్రింట్ కామెంట్
apj_abdul_kalam_meets_his_teacher_chiinadurai_niharonline

జీవితంలో ఎవరినైనా మరిచిపోవచ్చుగానీ, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఎట్టిపరిస్థితుల్లో మరిచిపోకూడదు. మరిచిపోవటం మాట అటుంచి ఇప్పడున్న విద్యార్థుల్లో కనీసం వారి పట్ల గౌరవం కూడా కరువైంది. అయితే ఎప్పుడో తనకు చదువు నేర్పిన గురువును మరిచిపోలేదు కదా అప్యాయంగా పలకరించారు శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం తనకు విద్య నేర్పించిన గురువును ఇప్పటికీ గుర్తుంచుకున్న ఆయన అనుకున్నదే తడవుగా కదిలారు. 91 సంవత్సరాల చిన్నదురై అనే ఓ ప్రోఫెసర్ 1950 సంవత్సరంలో తిరుచ్చి సెయింట్ జోసెఫ్ కాలేజీ ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అదే కాలేజీలో అప్పుడు కలాం చదువుకున్నారు. అక్కడ సైన్స్ పై కలాంకు మక్కువ పెరగడానికి ఈ చిన్నదురై యే కారణమట. ప్రస్తుతం దిండుకల్ ఏసుసభ గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను స్వయంగా కలిసేందుకు కలాం వెళ్లగా, తన శిష్యుడిని చూసి చిన్నదురై ఆనంద బాష్పాలు రాల్చారు. గురువు కన్నీటిని తుడిచిన కలాం, ఆయనను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, తాను రచించిన ఓ పుస్తకాన్ని గురువుకు కానుకగా ఇచ్చారు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిలో ఇలాంటి గుణం చాలా అరుదుగా కనిపించటం గ్రేట్ కదూ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ