దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు, అఘాయిత్యాలకు నెలవుగా మారిందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆడవాళ్ల మాన, ప్రాణాలకు అక్కడ అంత రక్షణ లేదని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అయితే జంబలకిడి పంబ లెవల్లో ఓ మగాడిపైనే అత్యాచార యత్నం జరిగితే... అవునండీ... సరిగ్గా ఢిల్లీలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఒక ఆటో డ్రైవర్ పై ఓ మహిళ అత్యాచార యత్నం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాళ్లోకి వెళ్లితే.. ఢిల్లీలోని సాకేత్ నుంచి అర్జున్ నగర్ లోని తన నివాసానికి ఓ మహిళ ఆటోను మాట్లాడుకుంది. అడ్రస్ కి చేరాక డబ్బులు ఇంట్లో ఉన్నాయని చెప్పగా, ఆ ఆటోవాలా ఆమె వెంట వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన అతనికి మొదట మద్యం ఆఫర్ చేసిన మహిళ ఆ తర్వాత అతనిపై అఘాయిత్యానికి పాల్పడింది. అతన్ని లాగి బట్టలు చింపేసి రేప్ చేయబోయింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. మరో మహిళ ఆ తతంగాన్ని కెమెరాతో షూట్ చెయ్యటం. దీంతో తన శీలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ డ్రైవర్ మేడ మీద నుంచి దూకేశాడు. దీంతో అతని రెండు కాళ్లు విరిగాయి. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా వారొచ్చి ఆ ఫ్లాట్ లో తనీఖీలు నిర్వహించారు. అక్కడ వారికి అనుకొని షాక్ లు తగిలాయట. కొన్ని ఆటో డ్రైవర్ల బ్యాడ్జీలు.. లైసెన్స్ లు దొరకటం గమనార్హం. ఇక ఈ వ్యవహారంలో ఓ మహిళను అరెస్ట్ చెయ్యగా, మరోకరు తప్పించుకున్నారు. అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్న మొత్తం కథేంటో తేలాల్సి ఉంది.