నేపాల్ లో ఏడుగురు... భారత్ లో నలుగురు

May 12, 2015 | 03:39 PM | 26 Views
ప్రింట్ కామెంట్
nepal_india_earthquake_died_niharonline

తాజా భారీ భూకంపం కారణంగా నేపాల్ లో ఏడుగురు మరణించగా, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. చౌతారా పట్టణంలో భూకంప ప్రభావానికి ఓ బహుళంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు రాజధాని ఖట్మాండు లో మరో ముగ్గురు మరణించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొన్ని చోట్ల భవనాలు కుప్పకూలినట్లు కూడా సమాచారం ఉందన్నారు. మరోవైపు ఈ భూకంపం ధాటికి  భారత్ లో కూడా నలుగురు మృతిచెందినట్లు సమాచారం. బీహార్ రాజధాని పాట్నా నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో ఇద్దరు మరణించగా,  యూపీలో కూడా మరో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన అఖిలేష్ యాదవ్ ఉన్నట్టుండి ప్రకంపనలు రావటంతో అధికారులతో కలిసి బయటకు దౌడు తీశాడట. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్, చెన్నై లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ