కోల్ కతా నగరం మంగళవారం ఉదయం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఇరువర్గాల ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాలు నాటు బాంబులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. నగరంలోని టిటాగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. టిటాగఢ్ రైల్వే స్టేషన్ దాటిన కొద్దిక్షణాల్లోనే రైల్లో బాంబుల మోత వినిపించింది. తెల్లవారుజామునే, అది కూడా లోకల్ ట్రైన్ లో జరిగిన ఈ పేలుడుతో కోల్ కతా వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయంలో 24 గంటల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని సీఎం మమతా బెనర్జీ పోలీస్ శాఖను ఆదేశించింది.