ప్రియురాలు పక్కన ఉన్న ఉద్రేకంలో ఆపులేక కక్కుర్తిపడి యువకుడు ప్రాణాలు పొగొట్టుకున్న ఘటన ఇది. అర్థరాత్రి యువతిని సొంత ఊరిలో దింపేందుకు కారులో బయలుదేరిన ప్రియుడు.. వేగంగా కారు నడుపుతూ ప్రియురాలితో శృంగారంలో పాల్గొని ఘోరతప్పిదం చేశాడు. యూపీలోని ఫిలిబిత్- పురాన్ పూర్ హైవేపై కఠానా బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు, వారి సమాచారంతో వచ్చిన పోలీసులు కారులో ఉన్న ఇద్దరినీ చూసి అవాక్కయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే... పురాన్ పూర్ కు చెందిన 24 ఏళ్ల యువతి.. ఫిలిబిత్ లో నివసిస్తూ ఉద్యోగం చేస్తోంది. అక్కడే పరిచయమైన 31 ఏళ్ల యువకుడితో స్నేహం ప్రేమగా మారింది. అత్యవసర పని నిమిత్తం ఆ యువతి తన సొంతింటికి వెళ్లాల్సి రావడంతో యువకుడు తన కారులో ఆ అమ్మాయిని దిగబెట్టేందుకు పురాన్ పూర్ బయలుదేరాడు. రొమాంటిక్ మూడ్ లో ఉద్రేకం ఆపుకోలేక కారులో ప్రయాణిస్తూనే ఇద్దరూ శృంగార చర్యకు దిగారు. డ్రైవింగ్ పై పట్టుకోల్పోయిన ఆ యువకుడు తన కారును ఎదురుగా వచ్చిన ట్రక్కుపైకి పొనిచ్చేశాడు.
ప్రియుడు, ప్రియురాలి ఒంటిపై నూలుపోగు లేకపోవడం, కారులో వారు ఇరుక్కుపోయిన భంగిమ, ట్రక్కు డ్రైవర్ వివరణనుబట్టి ఆ ఇద్దరూ కారులో శృంగారానికి పాల్పడటంవల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రియుడు అక్కడికక్కడే చనిపోగా, గాయపడ్డ ప్రియురాలికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది