పైశాచికంగా లైంగిక దాడికి గురైంది. ఆ షాక్ లో 42 ఏళ్లు కోమాలో ఉంది. చివరికి సోమవారం కన్నుమూసింది. ముంబైలోని కేఈఎం ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహించిన అరుణ షాన్ బాగ్ పై 1973 లో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న వార్డ్ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అరుణ కోమాలోని వెళ్లింది. గత 42 సంవత్సరాలుగా ఆమె కోమాలోనే ఉంది. ఇటీవలె ఆమె కారణ్య మరణానికి అనుమతివ్వాలంటూ 2011లో రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన పింకీ విరానీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె జీవితాన్ని దయనీయ స్థితిలో ఉంచేబదులు, కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని ఆమె కొరారు. అంతేకాదు అరుణాస్ స్టోరీ పేరుతో పింకీ ఓ పుస్తకాన్ని కూడా రాశారు. అయితే, పింకీ వేసిన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. కేఈఎం సిబ్బంది సైతం కారుణ్య మరణానికి అంగీకరించలేదు. ఇనేళ్లుగా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి అరుణ షాన్ బాగ్ తుది శ్వాస విడిచింది. విధులు నిర్వహించిన ఆ ఆస్పత్రిలో ఆమె కోమాలో ఉండి మృతిచెందటంతో ఆస్పత్రిలో విషాదం నెలకొంది.