సాధారణంగా కుర్రకారు యువతులకు ఫోన్లు చేసి వేధించటం చూస్తుంటాం. కానీ ఇక్కడో సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ఫోన్లలో అమ్మాయిలను అత్యధికంగా వేధిస్తున్న వాళ్లలో అత్యధికంగా ఉంది 50 ఏళ్లు పైబడినవారేనట. ఉత్తరప్రదేశ్ లో ఉమెన్ పవర్ లైన్ అనే సర్వీస్ ఒకటి ఈ మధ్య ప్రారంభించారు. అమ్మాయిలకు ఏమైనా వేధింపులు వస్తే వెంటనే 1090 అనే నంబర్ కు డయల్ చేస్తే చాలు పోలీసులు వారి భరతం పడతారు. అయితే ఇక్కడో కామెడీ ఏంటంటే... ఇప్పటిదాకా 3.45 లక్షల ఫిర్యాదులు రాగా అందులో 40 ఏళ్లు దాటిన వారిపైనే 45 శాతం ఫిర్యాదులు రాగా, 50 ఏళ్లు పైబడిన వారి పై 5 శాతం ఫిర్యాదులు వచ్చాయట.వారిలో ఎక్కువ మంది అసభ్యపదజాలం, లైంగిక వేధింపులు చేయటమే ఎక్కువగా చేస్తున్నారట. ఫిర్యాదులు అందిన వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, అయినా ఇందులో చాలా మంది వృద్ధులు ఇంకా వేధింపులు, అసభ్యకరంగా మాట్లాడటం చేస్తున్నారని పోలీస్ అధికారులు తెలిపారు.