కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చుట్టూ ముడి బిగుసుకుంటోందా? అతని భార్య సునంద పుష్కర్ హత్య కేసుతో అతడికి సంబంధం ఉందా?. పోలీసుల వ్యాఖ్యలు, సునంద పుష్కర్ సన్నిహితులు, థరూర్ ఇంటి పనిమనుషుల వాంగ్మూలం వంటివన్నీ థరూర్ ను దోషిగా చూపిస్తున్నాయి. వీటన్నింటినీ మించి థరూర్ వివాహేతర సంబంధాలు కూడా ఆమె హత్యకు కారణాలుగా భావిస్తున్నారు. శశిథరూర్, పాకిస్థాన్ జర్నలిస్టు మెహార్ తరార్ మధ్య సంబంధం ఉందని, సునందకు థరూర్ ఈ హత్యకు కారణమయి ఉండోచ్చని పనిమనుషులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారంట. దీంతో థరూర్ చుట్టూ ఉచ్చుబిగుస్తున్నట్లు కనిపిస్తోంది.