ఏపీ సహా ఆరు రాష్ట్రాలలో కండోమ్ ల కొరత

January 30, 2015 | 10:51 AM | 37 Views
ప్రింట్ కామెంట్

దేశంలోని ఆరు రాష్ట్రాలలో ప్రస్తుతం తీవ్రమైన కండోమ్ కొరత ఉందట. హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించే కార్యక్రమోం భాంగా జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ (నాకో) ఆయా రాష్ట్రాలకు కండోమ్ లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. నాకో నుంచి అందుతున్న కండోమ్స్, ఎయిడ్స్ టెస్టింగ్ కిట్లు, రిట్రోవైరల్ డ్రగ్స్ ను స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సోసైటీ(శాక్స్) లు ఆయా స్వచ్ఛంధ సంస్థల ద్వారా నిర్దేశిత గ్రూపులకు పంపిణీ చేస్తున్నాయి. తాజాగా తమకు కండోమ్ లతోపాటు, ఎయిడ్స్ కిట్లు సరిపడినన్ని అందడంలేదని ఆయా స్వచ్ఛంద సంస్థలు, శాక్స్ అధికారులకు మొరపెట్టుకుంటున్నాయట. ఈ తరహా విన్నపాలు వెల్లువెత్తుతున్న ఆరు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందట. ఎయిడ్స్ వ్యాప్తిని నిరోధించే కండోమ్స్, ఎయిడ్స్ కిట్లు సరఫరా స్తంభించడంతో సదరు రాష్ట్రాల్లో ఎయిడ్స్ మహమ్మారా మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీనంతటికి కారణం కండోమ్ లను సరఫరా చేయటంలో హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్ విఫలం కావటమేనట. ఇతర కంపెనీల నుంచి కండోమ్ ల సేకరణకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు చేపడుతున్న ఎడతెగని చర్యలే కండోమ్ ల షార్టేజీకి కారణమని నాకో అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వెలువెత్తుతున్న నిరసనలతో అధికారులు మేలుకోన్నారు. శుక్రవారం ఈ విషయమై ఉన్నతాధికారులు భేటీకానున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ