రేప్ వీడియోలు షేర్ చేస్తే బ్యాన్ చేస్తారా?

December 05, 2015 | 02:55 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Supreme_Court_of_india_refuses_to_ban_Facebook_Whatsapp_niharonline

సోషల్ మీడియా సైట్ల వల్ల ఎంత లాభమో అదే స్థాయిలో నష్టమన్నది ఈ మధ్య కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్స్ యాప్ ల ద్వారా అది ఎక్కువగా ఉందన్నది వార్తల్లో నిత్యం మనం వింటున్నాం. వాట్స్ యాప్ ద్వారా అత్యాచార వీడియోల్ని వ్యాప్తి చేయడం, ఫేస్ బుక్ ఖాతా ద్వారా సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తూ చిన్నారులను ఆకర్షించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చినా వాటిని తొలగించేందుకు ఆ వెబ్ సైట్లు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఆ రెండు సోషల్ మీడియాలను పూర్తిగా నిషేధించాలని సుప్రీంలో వ్యాజ్యం దాఖలైంది.

'ప్రజ్వల' సంస్థ చీఫ్ సునీతా కృష్ణన్  దీనిని దాఖలు చేశారు. దీనిపై శనివారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాటిని నిషేధించడం ఆచరణ సాధ్యం కాదని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ లలిత్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. అయితే అభ్యంతరకర, అసభ్యకర సమాచారం వ్యాప్తి కాకుండా నిరోధించడంలో ఈ వెబ్ సైట్లు విఫలమైతే వాటిపై విచారణ జరిపే అవకాశం ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. ఆ అంశం దిశగా చర్యలు చేపట్టాలని సుప్రీం ఆదేశాలు కేంద్రానికి సూచించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ