ప్యాసింజర్స్ కి బూతు బొమ్మలు చూపించి బుక్కయ్యాడు

August 25, 2015 | 04:56 PM | 5 Views
ప్రింట్ కామెంట్
TT_arrested_for_showing_porn_video_in_bhopal_niharonline

వ్యక్తులు ఎలాంటి వారైనా, వారి వ్యక్తిత్వాలు ఎంత పాడువైనా సమాజంలో మెదలాల్సిన తీరు మెదలకపోతే చాలా కష్టం. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ టికెట్ కలెక్టర్ ఇలాంటి వెకిలి చేష్టలకు దిగి ఫలితం అనుభవిస్తున్నాడు. భోపాల్ లో వేగంగా వెళుతున్నరైలులో మహిళా ప్రయాణికుల దగ్గర అనుచితంగా ప్రవర్తించిన టిక్కెట్ కలెక్టర్ కటకటాలపాలైయ్యాడు. మహిళా ప్రయాణికులు అతనికి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగించారు. పోలీసులు టీటీ మీద కేసు నమోదు చేశారు. భోపాల్ నుండి వెళుతున్న రైలులో టిక్కెట్ కలెక్టర్ మహిళా ప్రయాణికుల దగ్గరకు వెళ్లాడు. వారి దగ్గర ఉన్న టిక్కెట్లు పరిశీలించాడు. తరువాత జేబులో ఉన్న అతని స్మార్ట్ ఫోన్ బయటకు తీశాడు. అందులో డౌన్ లోడ్ చేసి ఉన్న పోర్న్ వీడియోలు చూడటం మొదలు పెట్టాడు.అంతటితో అతను ఆగలేదు. మహిళా ప్రయాణికుల దగ్గరకు వెళ్లాడు. తరువాత ఒక మహిళకు పోర్న్ వీడియోలు చూపించాడు. అతని చేష్టలకు విసిగి పోయిన మహిళలు టీటీకి బుద్ది చెప్పి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. సదరు టీటీ గారు ఊచలు లెక్కపెడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ