పసికందుతో సహా ఏడుగురిని చంపిన లవర్స్ కి క్షమాభిక్ష

May 26, 2015 | 02:14 PM | 28 Views
ప్రింట్ కామెంట్
sc_excution_lovers_niharonline

ఏడుగురిని నిర్దాక్షిణ్యంగా చంపి ఉరిశిక్ష పడిన ప్రేమ జంటను సుప్రీంకోర్టు పెద్ద మనసుతో మన్నించింది. షబ్నం, సలీమ్ అనే జంట గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, వారి ప్రేమకు షబ్నం ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో వాళ్లను విలన్లుగా భావించిన షబ్నం మట్టుపెట్టాల్సిందిగా ప్రియుడిని ఉసిగొల్పింది. 2008 ఏప్రిల్ 15న ముందుగా ఆమె తన ఇంట్లో వాళ్లకి మత్తు మందు కలిపిన పాలను ఇచ్చింది. వారంతా మత్తులోకి జారుకోగా, ఆపై ప్రియుడితో కలిసి వారందరినీ కడతేర్చింది. ఆఖరికి తన 10 నెలల మేనల్లుడిని కూడా షబ్నం విడిచిపెట్టలేదు. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు విచారించిన దిగువ న్యాయస్థానం మరణశిక్ష ఖరారుచేయగా, హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. త్వరలో వీరిని ఉరి తీయబోతుండగా వారు శిక్షను నిలిపివేయాలని ఉన్నతాధికారులకు పిటిషన్ పెట్టుకున్నారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మరణశిక్షను నిలిపివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను బుధవారం కు వాయిదా వేసింది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ