ముష్టి వేయలేదని ఘోరంగా మర్డర్ చేశారు

May 25, 2015 | 02:46 PM | 26 Views
ప్రింట్ కామెంట్
juvenile_crime_in_delhi_niharonline

ప్రస్తుత సమాజంలో పిల్లల్లో పెరుగుతున్న నేరప్రవృత్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  గత శుక్రవారం ఢిల్లీలోని గోవింద్ పురి ప్రాంతంలో  జరిగిన ఓ హత్య తమిళ సినిమాను మరిపించింది.  అయితే ఆ హత్య చేసింది కేవలం 9, 10 సంవత్సరాలున్న ఇద్దరు పిల్లలని తెలియటంతో పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు. బిక్షాటన చేసుకునే ఆ ఇద్దరు పిల్లలు స్థానికంగా పూల వ్యాపారం చేసుకునే సంజయ్ అనే వ్యక్తిని డబ్బులు అడిగారు. దానికి సంజయ్ నిరాకరించటంతో వారు చంపేస్తామని బెదిరించారు. అగ్రహాంతో ఊగిపోయిన సంజయ్ ఓ పిల్లాడిని చెంపపై కొట్టాడు. వారిలో మరోకడు పక్కనే ఉన్న బీరు బాటిల్ తీసుకుని సంజయ్ నెత్తిమీద బలంగా కొట్టాడు. ఇంకొకడు కుప్పకూలిన సంజయ్ మీద కూర్చుని పీకను అదే సీసాతో కోసేశాడు.  బాధితుడు తీవ్రం రక్తం స్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోయాడు. ఆ పిల్లల్ని  తోసి పారిపోవడానికి  సంజయ్ ప్రయత్నించాడనీ, కానీ  సగంవరకు  గొంతు తెగిపోయి తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ తప్పి పడిపోయాడని  ప్రత్యక్షసాక్షులు తెలిపారు.  తాము ఆసుపత్రి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా సంజయ్ నిరాకరించాడని పక్క షాపు యజమాని రోహ్తస్  కుమార్ తెలిపారు.  పోలీసులు వచ్చి తరలించేలోపే మరణించాడన్నారు. కాగా  రిక్షా కార్మికుల పిల్లలలైన  నిందితులిద్దరూ సంవత్సరం క్రితం ఇంట్లోంచి  పారిపోయి వచ్చి,  కల్‑కాజీ గుడి దగ్గర  బిక్షాటన చేస్తూ  ఉంటారని పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసి వారిని రిమాండుకు తరలించామని  చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ