వారు ముగ్గురు ఒకరికొకరు ముక్కు, మోహం తెలియని వారు. ఒకే ప్రాంతం కాదు, అయినా ఆలోచనలు కలిశాయి. సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా స్నేహితులు అయ్యారు. భావజాలాలు ఒకేలా ఉండటంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా రెండేళ్ల క్రితం జోవియాన్ అనే కంపెనీని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని షరాన్ పూర్ కి చెందిన రాఘవ్, హర్యానా కు చెందిన అంకిత్ భటేజా, సౌరభ్ కౌశల్. క్యూబ్ పేరిట రానున్న రెండేళ్లలో ఏకంగా శాటిలైట్ ను ప్రయోగించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న శాటిలైట్ల తయారీ, త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత, అంతరిక్షంలో చెత్తను తొలగించటం, సైన్యం కోసం పనిచేసే చిన్న చిన్న రోబోలను తయారుచేయటం తదితర లక్ష్యాలతో వీరు పరిశోధనలు చేస్తున్నారు. వీరి టాలెంట్ ను గుర్తించిన కేంద్ర సమాచార శాఖ వీరికి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది అంతేకాదు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యం కల్పించి ప్రస్తుతం వారంతా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తొడ్పడింది. తమ లాంటి అశావహులకు తమ వంతు ప్రొత్సాహాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు ఆ ముగ్గురు యువకులు.