భానుడి ప్రతాపం: మరో వారం రోజులు ఇంతేనట!

May 21, 2015 | 11:56 AM | 25 Views
ప్రింట్ కామెంట్
summer__niharonline

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అనూహ్యంగా పెరిగిన ఉష్టోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణా జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండలకు జడిసి జనం బయటకు రావటం లేదు.  మండుతున్న ఎండలనుంచి ఉపశమనం కోసం ప్రజలు విద్యుత్ పరికారాలను  ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. దీనివల్ల ట్రాన్స్ ఫార్మర్లపై భారం పడి, విద్యుత్ సరఫరాకు  అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పరిస్థితి మరీ దారణంగా తయారైంది. అటు బయట భానుడి ప్రతాపం, ఇటు ఇంట్లో విద్యత్ సమస్య. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. కాగా  బుధవారం  ఒక్కరోజే తెలంగాణాలో 37 మంది, ఆంధ్రప్రదేశ్ లో 23 మంది వడదెబ్బతో మరణించినట్టు సమాచారం. వడదెబ్బ నుంచి ఉపశమనం కోసం కొబ్బరినీళ్ళు, బార్లీ, వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాని, అవి అందుబాటులో లేకుంటే మంచినీళ్ళయినా ఎక్కువ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ