గంగలో 100కుపైగా గుర్తుతెలియని శవాలు!

January 14, 2015 | 02:23 PM | 65 Views
ప్రింట్ కామెంట్

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ - ఉన్నావ్ పట్టణాల మధ్య గంగానదిపై 100కు మృతదేహాలు తేలుతూ కనిపించటం సంచలనం సృష్టించింది. చనిపోయిన తమ బంధువులను ముక్తి కోసం గంగలో జారవిడిచి ఉంటారని అధికారులు తెలిపారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో శవాలు కనపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వారన్నారు. కాగా, మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని, ఈ ఘటనకు విచారణకు ఆదేశించామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. నదిలో నీరు తగ్గుముఖం పట్టడంతోనే శవాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది. అయితే పోస్టు మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు నిర్వహించాలనడంపై పలు సందేహాలకు తావు వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ