హవ్వా... రెండేళ్ల చంటి పిల్లాడిపై చోరీ కేసు!!

October 01, 2015 | 11:20 AM | 1 Views
ప్రింట్ కామెంట్
UP-police-file-a-case-against-2years-old-boy-niharonline

ఇండియాలో ఏదైనా సాధ్యమే. తిమ్మిని బమ్మి చేసే రకం మనలో చాలా మంది ఉన్నారు. ప్రజలకు మంచి చెయ్యాల్సిన పాలకులు, అధికారులే ఈ వరుసలో ముందుంటారు కూడా. సమయం, సందర్భం ఏదనేది చూసుకోకుండా ఎంతకైనా తెగించటంలో వారికి వారే సాటి. అప్పుడు వారికి విచక్షణ కూడా పనిచెయ్యదంటే అతిశయోక్తి కాదు. దాంతోనే వారు దొిరికిపోతుంటారు కూడా. దానికి నిదర్శనమే తాజా ఘటన. సరిగ్గా మాటలు కూడా రాని రెండేళ్ల పిల్లాడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... యూపీలోని సర్దార్ పూర్ ప్రాంతంలో ఈ నెల 20న ఓ చోరీ జరిగింది. దీంతో అనుమానంతో అదే గ్రామానికి చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతవరకు ఓకే గానీ పోలీసులు అక్కడే పప్పులో కాలు వేశారు. కేసు నమోదు చేసిన నలుగురిలో ఒక రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడట. ఇదేంటని బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించటంతో నాలుక కరుచుకున్న పోలీసులు అదంతే అని చెప్పారట. దీంతో లబోదిబోమంటూ బాలుడి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇద్దరూ న్యాయస్థానం ముందు హాజరుకాగా, సరిగ్గా మాట్లాడటం కూడా రాని చంటిపిల్లాడు దొంగతనం ఎలా చేస్తాడంటూ అతని తండ్రి న్యాయస్థానం ముందు వాపోయాడు. దీంతో వాదోపవాదాల అనంతరం బాలుడిపై న్యాయస్థానం కేసు కొట్టివేసింది. ఆ మాత్రం ఇంగిత జ్నానం లేకుండా కేసు ఎలా నమోదుచేశారంటూ పోలీసులను కోర్టు మందలించిందట. దీంతో చేసేది లేక బాలుడి తండ్రికి, న్యాయస్థానానికి పోలీసులు క్షమాపణలు చెప్పుకోవాల్సింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ