పాపం... బిందెలో చిక్కుకున్న చిరుత

September 30, 2015 | 05:55 PM | 4 Views
ప్రింట్ కామెంట్
cheetah-head-struk-in-steel-pot-in-rajasthan-niharonline

ఎరక్క పోయి వచ్చి ఇరుక్కుపోయినట్లు అయ్యింది ఆ పులి పరిస్థితి. పాపం దారి తప్పిన ఓ చిరుత ఆ ఊర్లోకి వచ్చింది. దప్పికతో ఓ ఇంటి ముందు ఉన్న బిందెలో నీళ్ల కోసం తలదూర్చింది. అంతే... కట్ చేస్తే చిరుతకి కష్టాలు మొదలయ్యాయి. పులి కాస్త పిల్లిలా మారి గంతులేసింది. నీళ్లు తాగకపోగా, తల బయటకు రాక పిచ్చిపట్టినట్లు పరిగెత్తింది. ఈ సంఘటన రాజస్థాన్ లోని సమంద్ జిల్లాలో జరిగింది.

చిరుత పులిగాండ్రింపులు వినబడుతుండటంతో ఆ ఇంట్లో వారితో పాటు, స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. బిందెలో తల ఇరుక్కుపోయిన చిరుతను చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. పోనీ, ఎవరైనా ధైర్యం చేసి ఆ బిందెను తొలగిస్తారేమో అనుకుంటే, అంత సాహసం ఎవరూ చేయలేక, చివరకు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి దానికి మత్తు మందు ఇచ్చి పాపం బయటికి తీశారట. అనంతరం దాన్ని సమీపంలోని అడవి వద్ద వదిలేసినట్లు అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ