అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ జమీరుద్దీన్ షా ఎట్టకేలకు దిగొచ్చారు. యూనివర్సిటీ లైబ్రరీలోకి అమ్మాయిలను అనుమతిస్తామని కోర్టుకు తెలిపారు. గ్రంథాలయాల్లోకి అమ్మాయిలను అనుమతిస్తే, అబ్బాయిలు అంతకు ముందకు వచ్చేవారికంటే నాలుగు రెట్లు ఎక్కువ వస్తారని ఈ సారు వ్యాఖ్యానించారు. అప్పుడు లైబ్రెరీలో స్థలం సరిపోదంటూ ఏకంగా అమ్మాయిల ప్రవేశాన్ని ఆయన అడ్డుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. ఇక ఈ విషయంలో ఏకంగా కేంద్రమంత్రి స్మ్రుతి ఇరానీ స్వయంగా కలుగజేసుకుని నివేదిక సమర్పించాల్సింది అధికారులను ఆదేశించారు. జమీరుద్దీన్ ను క్షమాపణ చెప్పాలని ఆమెతోపాటు ఎంతమంది ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఆయన లొంగలేదు. అయితే, స్వయంగా అలహాబాద్ హైకోర్టే కలగజేసుకుని గట్టిగా మొట్టికాయలు వేయడంతో ఎట్టకేలకు వీసీ జనరల్ జమీరుద్దీన్ షా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాలేజీ లైబ్రెరీలోకి అమ్మాయికి అనుమతిస్తానని స్వయంగా కోర్టుకు కూడా తెలిపారు.