మన ట్రాఫిక్ పోలీసులు తరచు ఇలాంటి ఫీట్లకు పాల్పడటమే షరా మూములే కదా. ఇక ఈ సంఘటన మీరట్ లో చోటుచేసుకుంది. హసన్ పూర్ ప్రాంతానికి చెందిన శైలేందర్ సింగ్ తన నాలుగు నెలల కొడుక్కి ఆరోగ్యం బాలేదని మారుతి స్విఫ్ట్ కారులో ఆస్పత్రికి బయలుదేరాడు. మధ్యలో ట్రాఫిక్ ఆఫీసర్ అతన్ని ఆపి పేపర్లు చూపాల్సిందిగా కోరాడు. అయితే అన్ని పేపర్లు చూపించినప్పటికీ పోలీసులు శైలేందర్ ను అంత సులువుగా వదలలేదు. దీంతో శైలేందర్ కి, అక్కడి పోలీసాఫీసర్ కి వాడీ వేడీ వాదన జరిగింది. ఇక ట్రాఫిక్ ఆఫీసర్ కి ఏమనిపించిందో ఏమో హెల్మెట్ లేకుండా కారు నడుపుతావా అంటూ ఫైన్ వేశాడు. ఇక విస్తు పోవటం శైలేందర్ తోపాటు అక్కడున్న వాళ్ల వంతు అయ్యింది. దీనిపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే అది పొరపాటున జరిగిందని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నయం బైక్ కి సీటు బెల్ట్ పెట్టుకోలేదంటే జనాల పరిస్థితి ఏంటో!!