ఒబామా భారత్ రాకకు భారీ భద్రతా ఏర్పాట్లు

January 19, 2015 | 11:19 AM | 40 Views
ప్రింట్ కామెంట్

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మరియు ఆయన శ్రీమతి మిచెల్ ఒబామా రిపబ్లిక్‌ డే సందర్భంగా భారతదేశానికి వస్తున్నందున వీరి రక్షణ కోసం ఈసారి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న ఉదంతాలతో పాటు.. ఉగ్రవాద దాడులకు సంబంధించిన సందేహాలు కూడా ఈ భారీ ఏర్పాట్లకు కారణంగా చెబుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒబామా రక్షణ కోసం 1600 మంది యూఎస్‌ సెక్యూరిటీ సిబ్బంది భారత్‌కు వస్తున్నారు. వీరంతా ఒబామాను కంటికి రెప్పలా చూసుకుంటారు. ప్రతి కదలికను పరిశీలనగా చూడటంతో పాటు.. ఏ చిన్న పొరపాటు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో ఒబామా భారత్‌కు వచ్చినప్పుడు ఇంతే ఏర్పాట్లు చేసినప్పటికి.. అప్పట్లో వినియోగించిన సెక్యూరిటీ సంఖ్య కేవలం 800 మంది మాత్రమే. కానీ.. ఈ సారి అందుకు భిన్నంగా 1600 మందిని వినియోగిస్తున్నారు. వీరికి అదనంగా భారత బలగాలు కూడా ఉండనున్నాయి. ఇంత భారీగా సెక్యూరిటీకి మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు. ఒబామా రెండు గంటల పాటు రిపబ్లిక్‌డే సందర్భంగా ఆరుబయట ఉండే అవకాశం ఉందని.. ఇంత సుదీర్ఘ సమయం ఒకేచోట లేవకుండా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో మరింత భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నారని భద్రతా సిబ్బంది చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ