లేటు వయస్సులో మణిపూర్ మంత్రి పెళ్లి

January 18, 2015 | 02:25 PM | 54 Views
ప్రింట్ కామెంట్

ఆ పెద్దాయనకు ఈ వయస్సులో పెళ్లిపై ధ్యాస మళ్లీంది. అంతే వయస్సుతో నిమిత్తం లేకుండా ఓ 24 ఏళ్ల యువతిని పెళ్లాడాడు. మణిపూర్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి ఫుంగ్ జథాంగ్ తోన్సింగ్ 77 వయస్సులో పెండ్లి పీటలు ఎక్కారు. తనకన్నా 53 ఏళ్లు చిన్నదైన యువతిని పెళ్లాడాడు. ఇంఫాల్ లోని ఇవాంజెలికల్ బాపిస్ట్ చర్చిలో జరిగిన వివాహ వేడుకలో మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రామ్ ఇబోబిసింగ్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తోన్సింగ్ కుటుంబ సభ్యులందరూ రాష్ట్రం బయట నివసిస్తుండటంతో ఈ లేటు వయస్సులో తన బాగోగులు చూసుకునేందుకు ఈ పెళ్లి చేసుకున్నట్లు ఆయన చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ