ప్రియుడ్ని చంపిన కేడీ డాక్టర్... ఫేస్ బుక్ తో బుక్కయ్యింది

February 09, 2015 | 10:51 AM | 46 Views
ప్రింట్ కామెంట్
killer_lady_doc_caught_in_punjab_niharonline

ఆమె ఓ వైద్యురాలు. ఓ జడ్జి హత్యకేసులో దోషి. ఇంతకూ జడ్జిని ఎందుకు హత్య చేయించిందంటారా? ఆమె ఆయనగారిని ప్రేమించింది. పెళ్లికి నిరాకరించడంతో చంపించింది. ఆ జడ్జికి అదివరకే భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు! అనంతరం బెయిల్ పైన బయటికొచ్చిన ఆమె దేశం నుంచి పారిపోయేందుకు వ్యూహం పన్నింది. చివరకు ఫేస్‌బుక్ వల్ల పోలీసులకు చిక్కింది! విషయంలోకి వెళ్తే... పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన రవ్‌దీప్ కౌర్ అనే గైనకాలజిస్ట్ చండీగఢ్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి విజయ్‌సింగ్‌ను ప్రేమించింది. అతను పెళ్లికి నిరాకరించటంతో 2005లో మంజీత్ సింగ్ అనే వ్యక్తికి రూ.5 లక్షలు ఇచ్చి ఆ జడ్జిని హత్యచేయించింది. దీంతో కోర్టు మంజీత్‌సింగ్‌తో పాటు ఆమెకు కోర్టు 2012లో జీవితఖైదు విధించింది. రెండుసార్లు పెరోల్‌పై బయటికి వచ్చిన కౌర్ పారిపోయేందుకు పక్కా స్కెచ్ వేసుకుంది. రూ. 12 లక్షలకు పైగా నగదు, కిలో బంగారం సిద్ధం చేసుకుంది. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని దేశం విడిచి వెళ్లాలని పథకం వేసింది. మూడోసారి గతేడాది డిసెంబర్ 6న ఆమె పెరోల్‌పై బయటికి వచ్చింది. ఇంట్లో సూసైడ్ నోట్ రాసిపెట్టి పరారైంది. అయితే పోలీసులు అంత తేలికగా ఈ వ్యవహారాన్ని నమ్మలేదు. అనంతరం అర్పితా జైన్ అనే పేరుతో ఉత్తరాఖండ్, నేపాల్ వెళ్లింది. ఫోన్ వాడకుండా జాగ్రత్తపడింది. మరోవైపు పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. అమెరికాలోని ఆమె బంధువు ఫేస్‌బుక్ ఖాతాపైనా దృష్టిపెట్టారు. దీంతో ఫేస్‌బుక్‌లో మారుపేరుతో బంధువుతో సంబంధాలు నెరుపుతున్న ఆమెను గుర్తించారు. నకిలీ పత్రాల కోసం ఉత్తరాఖండ్‌కు వచ్చిన కౌర్‌ను అరెస్టు చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ