పార్టీ మారినా ప్రశంస మాత్రం దక్కింది

January 22, 2015 | 01:39 PM | 36 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీని ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శాంతి భూషణ్ ప్రశంసించారు. అరవింద్ కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీ మంచి వ్యక్తి అని ఆయన కీర్తించారు. ఈ సందర్భంగా బేడీ సీఎం అభ్యర్థిత్వాన్ని ఆయన స్వాగతించారు. బేడీ సమర్థవంతమైన పాలకురాలు కాగలరు. అంతేకాదు ఢిల్లీకి స్పష్టమైన, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలరు అని భూషణ్ అభిప్రాయపడ్డారు. అయితే కిరణ్ బేడీ ఆప్ సీఎం అభ్యర్థి అయితే బాగుండేదన్నారు. సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా స్వాగతించాలని కోరారు. ఇదిలా ఉంటే, శాంతి భూషణ్ వ్యాఖ్యలపై మరో ఆప్ నేత అశుతోష్ స్పందించారు. అదంతా భూషణ్ వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ