వేలాది మంది ప్రజలు, అభిమానులు, నేతల మధ్య కాసేపటి క్రితం కలాం అంత్యక్రియలు ముగిశాయి. భారత కాలమానప్రకారం ఉదయం 11.45 నిమిషాలకు ఆయన పార్థివ దేహన్ని ఖననం చేశారు. మాజీ రాష్ట్రపతి, క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాంకు ప్రముఖ నేతలు, ప్రజలు నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల మధ్య ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆయన దేహన్ని భూమాత ఒడిలోకి పంపారు. అంతకు ముందు సైనిక లాంఛనాల సూచకంగా, గాల్లోకి కాల్పులు జరిపారు. కలాం అమర్ రహే అంటూ అభిమానుల నినాదాలు ఆకాశాన్నంటాయి. ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే స్మారక చిహ్నం నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.