దేశీ పోర్న్ పైనే మనోళ్లకు మక్కువ ఎక్కువ

April 07, 2016 | 12:54 PM | 1 Views
ప్రింట్ కామెంట్
indians-like-desi-porn-niharonline

పోర్న్‌ సినిమాలను వీక్షించటంలో భారతీయులు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా విడుదలైన ఒక సర్వే కూడా ఇదే చెబుతోంది. అయితే ఒకప్పుడు విదేశీ శృంగార దృశ్యాలను అధికంగా వీక్షించిన యువత ఇప్పుడు 'దేశీ పోర్న్‌' దృశ్యాలపైనే అధికంగా ఆసక్తి చూపుతుందంట. ఓ పాపులర్ ఆంగ్ల దినపత్రిక పోర్న్‌హబ్ వెబ్‌సైట్‌ను ఆరా తీయగా వారు వెల్లడించిన విషయాలు మీకోసం.

                     నీలి దృశ్యాల వీక్షణలో టాప్-5లో ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్‌ లు నిలిచాయి. అత్యధికంగా పోర్న్ ట్రాఫిక్(39.2శాతం) ఢిల్లీ నుంచే నమోదవుతుందట. ఢిల్లీవాసులు ఎక్కువగా, 'ఇండియన్ బాబీ', 'బెంగాలీ', 'ఇండియన్ ఆంటీ' పదాలను సెర్చ్‌ చేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. రెండోస్థానంలో ఉన్న చెన్నై నుంచి ఆరుశాతం మంది పోర్న్ వెబ్‌సైట్లను చూస్తున్నారు. చెన్నైవాసులు అధికంగా తమ సెర్చ్‌లో 'తమిళ్‌' పదాన్ని ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఇక మూడో స్థానంలో ఉన్న కోల్‌కతా వాసులకి-ఢిల్లీ వాసులకి మధ్య ఓ పోలిక ఉంది. సగటున 9నిమిషాల 29 సెంకండ్లపాటు ఢిల్లీ, కోల్‌కతా వాసులు శృంగార దృశ్యాలను తిలకిస్తున్నారు. కోల్ కతా ప్రజలు ఎక్కువగా 'ఆస్‌', 'స్కూల్' పదాలనే శోధిస్తున్నట్లు 'పోర్న్‌హబ్‌' తెలిపింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న ముంబై ప్రజలు హర్డ్ కోర్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారంట. ఇక మన హైదరాబాద్ విషయానికొస్తే బూబ్స్,  ఇండియన్ ఆంటీ, మల్లు గర్ల్స్,  ఇండియన్ కాలేజీ గర్ల్స్‌లాంటి పదాలను వెతుకున్నారని సర్వే తెలిపింది. ఇక్కడి యువతలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ శాతం పోర్న్ వీడియోలపై ఆసక్తి చూపుతున్నారని పోర్న్ హబ్ వెల్లడించటం విశేషం.

                      గత ఏడాది ఆగస్టులో పోర్న్‌గ్రఫీ కంటెంట్ ను అందిస్తున్న 857 వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ తర్వాత ఆ నిషేధాన్ని చైల్డ్ ప్రోర్నోగ్రఫీకి మాత్రమే పరిమితం చేసింది. అయినప్పటికీ వీక్షణలో మాత్రం భారతీయులు వెనక్కి తగ్గట్లేదు. పైగా "బి ఇండియన్ బై ఇండియన్" సూత్రాన్ని ఫాలో అయిపోతున్నారు. వీళ్ల దేశ భక్తి తగలేయ!  అన్నట్లు పోర్న్‌ దృశ్యాల కోసం జరుపుతున్న టాప్ సెలబ్రిటీల సెర్చ్‌లో సన్నీ లియోన్‌ మొదటిస్థానంలో ఉండగా, మియా ఖలిఫా, టీవీ స్టార్లు కిమ్ కర్దాషియన్, లిసా ఆన్‌ లు తదుపరి స్థానాల్లో ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ