‘హత్యాచారం’ కేసులో వదరు బోతు కుక్కల కొడుకులు!

March 07, 2015 | 03:13 PM | 52 Views
ప్రింట్ కామెంట్
abuse_against_women_neil_sen_niharonline

దారుణంగా బలయిపోయిన అభాగ్యురాలు నిర్భయ ఘటనతో జాతి ఉలిక్కిపడింది. రెండేళ్ళనంతరం తిరిగి అదే నిర్భయపై తీసిన డాక్యుమెంటరీ కలకలం రేపుతోంది. ఈ డాక్యుమెంటరీ నిర్మించిన ఉడ్విన్ కూడా అత్యాచార బాధితురాలే. జైలులో భద్రంగా ఉన్న నిందితుడు ముఖేష్ సింగ్ ను ఇంటర్వ్యూ చేసేందుకు సదరు నీచుడు రెండు లక్షలు డిమాండ్ చేయగా, నలభైవేల రూపాయలకు ఒప్పించిన ఘనత ఉడ్విన్ ది. డాక్యుమెంటరీ విషయంలో పలు విధాల చర్చోపచర్చలు జరుగుతుండగా గ్యాంగ్ రేప్ చేసిన దోషుల తరఫున వకాల్తా పుచ్చకున్న శర్మ, సింగులు అనే వకీళ్ళు ఉచితానుచితాలు మరచి మహిళలని కుక్కలతో పోల్చి వారి పట్ల విద్వేషభావనాకండూతిని తీర్చుకోవడం జరిగింది. వీరిని యావత్ సమాజం ఛీత్కతరించింది. సోదర బార్ కౌన్సిల్ కూడా ఈ ఇరువురిపై కఠిన చర్యలకు సిఫార్సు చేసింది. రాజ్ నాథ్ సింగు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా చూడగలనని బీరాలు పలికినా, బిబిసి వారు తమ పని కానిచ్చేశారు. ఒకడేమో తన కూతురే ఇలా ఇరుక్కుంటే తగలబెట్టేస్తానన్నాడు. అసలు ఆ బస్సు నడిపిన దుష్టుడే, దీన్లో తప్పంతా ఆ పిల్లదే అన్నాడు. సవ్యమైన ఆడపిల్లలెవరూ రాత్రి తొమ్మిది గంటలపుడు చక్కర్లు కొట్టరు అని తనని సమర్థించుకున్నాడు. ఈ కేసు ఇంత తాపీగా నత్తనడక నడిస్తే సినిమా అయినా తీస్తారు, ఎవరైనా ఏమైనా వదరుతారు. ఇంకేమైనా జరగొచ్చు. భరతమాత పుణ్య చరితగల... స్త్రీలకు ఎనలేని గౌరవమిచ్చే పవిత్ర భూమిలో జరుగుతున్నది పూర్తిగా విరుద్ధం. ఇంత జరిగినా మార్పు రావాలని కోరుకోవడం మానొద్దు మనం!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ