నిషేధాన్ని విధించిన కొన్ని గంటల్లోనే ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసింది. భారత నిబంధనలు ఏ మాత్రం ఖాతరు చేయకుండా బ్రిటన్ ఛానెల్ తను పని తాను చేసుకుపోయింది. బీబీసీ ఛానల్ ఫోర్‌లో నిర్భయ నిందితుడు ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. ఈ విషయంపై తమకు ఎలాంటి సంబంధం లేదనీ, నిందితుడిని కఠినంగా శిక్షించడమే తమకు కావాలని నిర్భయ తల్లిదండ్రులు చెపుతున్నారు. నిర్భయ ఈ డాక్యుమెంటరీని నిలిపివేయాలని బుధవారం భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ డాక్యుమెంటరీని బీబీసీ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీని బ్రిటన్ దేశంతో పాటు మరికొన్ని ఇతర దేశాలు కూడా ప్రసారం చేసాయి. నిజానికి ఈ డాక్యుమెంటరీని ఈ నెల న అంటే మహిళా దినోత్సవం రోజున భారత్‌లో కూడా ప్రసారం చేయాలని బీబీసీ అనుకుంది. అయితే దీనికి సంబంధించి పెద్ద పార్లమెంటులోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఉరిశిక్ష పడిన నిందితుడిని ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ లెస్లీ ఉడ్విన్ నిన్న రాత్రే భారత్ విడిచి వెళ్ళిపోయింది. అయితే తమ నిషేధాఙ్ఞలను ఏ మాత్రం ఖాతరు చేయని బ్రిటన్ పై తగిన చర్యలు తీసుకోనున్నట్టు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.