అమీర్ ఖాన్ నటించిన చిత్రం ‘పీకే’ను బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటీషన్ పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది. వారంలోగా మీ సమాధానాన్ని న్యాయస్థానంలో సమర్పించాలని ఆదేశించింది. హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ దాఖలు చేసిన పిల్ ఆధారంగా జస్టిస్ ఇంతియాజ్ ముర్తాజా, జస్టిస్ రితురాజ్ అవస్తీల నేత్రుత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన యు/ఏ సర్టిఫికెట్ ను కూడా తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.