దేశంలో అతి పెద్దదిగా భావిస్తున్న పోర్న్ వీడియో స్కాండల్ నిందితుడిని సీబీఐ అధికారులు గురువారం బెంగుళూరులో అరెస్టు చేశారు. అతను విద్యావంతుడు, ధనవంతుడు కూడా. కానీ జల్సాలకు అలవాటు పడి అక్రమంగా సంపాదించాలనే దుర్భద్ధితో ఈ పనులకు ఒడిగట్టాడు. అతని పేరు కౌశిక్ కునాల్. అశ్లీల వీడియోలను భారీ ఎత్తున ఇంటర్ నెట్ లోకి అప్ లోడ్ చేస్తూ, విపరీతంగా డబ్బు సంపాదించాడట. అరెస్టు సమయంలో అతడి వద్ద దొరికిన వస్తువులన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న స్టెల్త్ కెమెరాలు, వాటిని ఎడిట్ చేసేందుకు హై ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ఉన్నాయని అధికారులు చెప్పారు. దాదాపు 500కు పైగా అశ్లీల వీడియోల్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడిపై ఐటీ యాక్ట్ తో పాటు లైంగికదాడి కేసు కూడా నమోదు చేశామని సీబీఐ అధికారులు చెప్పారు. వీడియోలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో చిత్రీకరించారో తెలుసుకోవడం కష్టంగా మారడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫోరెన్సిక్ సాఫ్ట్ వేర్ సహాయంతో కౌశిక్ కునాల్ ను పట్టుకున్నాసీబీఐ అధికారులు తెలిపారు.