గాంధీ దక్కిన గౌరవం మహానుభావుడికి దక్కాలి!!

August 01, 2015 | 05:04 PM | 3 Views
ప్రింట్ కామెంట్
apj_abbdul_kalam_on_currency_niharonline

జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత ఆ స్థాయిలో గత మూడు దశాబ్దాల నుంచి దేశ ఆధునిక అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా ప్రజల్లో జాతీయవాదాన్ని రగిలించడంలో అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారు. అందుకే జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా మహత్ముడి తర్వాత ఆ స్థాయిలో దేశం మొత్తం గౌరవమిచ్చింది. కనివిని ఎరుగని రీతిలో ఆ వ్యక్తికి నివాళులర్పించింది. వేలాది మంది ప్రజలు భారత్ మాతా కీ జై అంటూ నినదిస్తుండగా అంత్యక్రియలు జరిగాయి. అంతటి ప్రేమాభిమానాలను అందుకున్న కలాంకు ఓ అరుదైన గౌరవం దక్కాలని ఇప్పుడు దేశమంతా కొరుకుంటుంది.

      సాధారణంగా కరెన్సీ నోట్లపై మహాత్ముడి ఫోటో ఉంటుంది. అయితే ఇప్పుడు నోట్లపై మాజీ రాష్ర్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం ఫోటో కనబడటం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ అయ్యింది. ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టిన ఈ ఫోటోలకు వస్తున్న లైక్ లు, కామెంట్ల ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇక దీన్ని నిజం చేయాలంటూ నెటిజన్లు కొరుకుంటున్నారు. అలాంటి గౌరవం అందుకునే అన్ని అర్హతలు కలాం కు ఉన్నాయన్నది వారి అభిప్రాయం. కొందరైతే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోదీ ఈ విషయంలో కలుగజేసుకుని ఆ దిశగా చొరవచూపాలని కొరుతున్నారట. పరిణామాలను పరిశీలిస్తే దేశమంతా గాంధీతోపాటు కలాం ఫోటో కూడా నోట్లపై ఉండాలని బలంగా కొరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అది నెరవేరాలని మనమూ ఆకాంక్షిద్దాం...  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ