గన్ షాట్: పతంజలి మందుకు పండంటి మగబిడ్డ అట

January 30, 2015 | 11:40 AM | 54 Views
ప్రింట్ కామెంట్

యోగా గురువు బాబా రాందేవ్ పై మరోమారు వివాదం చెలరేగింది. ఆయనకు సంబంధించి పతంజలి ఫార్మసీ ద్వారా లభిస్తున్న దివ్య పుత్రజీవక్ సీడ్ మందును వాడితే, మగ బిడ్డలు పుట్టడం ఖాయమేనన్న ప్రచారం జోరుగా సాగటం ఇప్పుడ చర్చనీయాంశమైంది. ఈ మందుతో సంతాన సమస్యలు తొలగి, పండంటి మగబిడ్డ పుడతాడని రాందేవ్ నుంచి సందేశం వచ్చిందని ఢిల్లీలోని రాందేవ్ మెడికల్ స్టోర్ లో పనిచేస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ గురువారం ఓ జాతీయ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ మందు వల్లే తమకు మగబిడ్డ పుట్టాడని కొంతమంది వ్యక్తులు ఇతరులకు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ మందు విపరీతంగా అమ్ముడుపోతుంది. ముఖ్యంగా హర్యానాలో ఈ మందుకు ఫుల్లు గిరాకీ ఉందట. ఆ రాష్ట్రంలో ఇప్పుడు మందు అసలు దొరకట్లేదని సమాచారం. ఇదిలా ఉంటే, ఈ మందులో ఎలాంటి శాస్త్రీయత లేదని, దీని వల్ల మగ సంతానం కలుగుతుందన్న గ్యారెంటీ లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే రూ.35 లే కావటంతో జనం ఎగబడి కొంటున్నారేమో అని వారు ఛలోక్తులు పేలుస్తున్నారు. ఇదేమో పైత్యమో ఏమో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ