లైంగిక దాడి కేసులో శిక్షను అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తన ఆరోగ్యం బాగా లేదని, శస్త్ర చికిత్స చేయించుకునేందుకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన కోరారు. ఆశారాం ను పరిక్షించి నివేదిక సమర్పించాలని ఏడుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్ బ్రుందాన్ని ఆదేశించింది. అయితే ఆశారాంకు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని, ఆయన కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ మందులతోనే నయమవుతుందని వైద్యులు తమ మెడికల్ రిపోర్టును సుప్రీంకు సమర్పించారు. దీంతో బెయిల్ అక్కర్లేదని భావించిన కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఆయన బెయిల్ కోసం నాలుగు సార్లు ప్రయత్నించగా కోర్టు పిటిషన్లనన్నింటిని కొట్టివేసింది.