తెలుగు నటుడు, హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరలోనే తాత అవుతున్నానంటూ ప్రకటించేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో బుధవారం ఆయన స్నేహితుడు చల్లకొండ రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అక్కడ ఈ సంతోష వార్తను అభిమానులకు చెప్పి వారిని ఆనందంలో ముంచేశారు. పెళ్ళి వేడుకల్లో బాలయ్య తాతకాబోతున్నాడన్న వార్త కూడా తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు హోరు బాజాల మధ్య మారుమ్రోగిపోయింది. ఇంతకూ బాలయ్య తాతయితే, సీఎం చంద్రబాబు కూడా తాతవుతున్నట్టే కదా... బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలే కదా... బ్రాహ్మణి గర్భవతి అంటూ కొద్దిరోజుల వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను ఇప్పుడు బాలయ్య నిజం చేశారు. అంటే త్వరలో బాలయ్య-చంద్రబాబుల ఇంట క్రెడిల్ సెర్మనీ జరుగనున్నదాన్నమాట.