బాలీవుడ్ సినిమా రంగం మొత్తం ఇప్పుడు బయో పిక్ సినిమాలతో హోరెత్తి పోతోంది. ఆ లైన్ లో ఇప్పుడు సచిన్ కూడా ఉన్నారు. తన జీవిత కథ ఆధారంగా తీస్తున్న చిత్రానికి సరిపోయే మంచి పేరు పెట్టమని ఆయన అభిమానులను కోరుతున్నారు. రవి 0404, 200 నాటౌట్ ఫిల్మ్స్ సం యుక్తంగా సచిన్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించనున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ప్రపంచకప్లో పది జట్లకు మాత్రమే అవకాశం కల్పిస్తామని ఐసీసీ అనడం అన్యాయమని క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. అనుబంధ దేశాలకు అవకాశం ఇవ్వకుండా ఐసీసీ వెనకడుగు వేయడం మంచిదికాదన్నారు. రానున్న ప్రపంచకప్ లో ఇరవై ఐదు జట్లకు అనుమతి ఇవ్వాలని సచిన్ కోరాడు. వచ్చే వరల్డ్ కప్లో పది జట్లకు మాత్రమే అవకాశం ఇస్తామని ఐసీసీ ఇటీవల చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.