నరమాంస భక్షకులు ఎక్కడుంటారు? ఆఫ్రికా అడవుల్లోనా? కొరియా అడవుల్లోనా? అంత దూరంలో లేరండీ... మన ఇండియాలోనే ఉన్నారట.... అది కూడా ఆద్యాత్మిక క్షేత్రంగా భావించే వారణాసిలో. నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇది నిజమేనంటున్నారు. జడలమాదిరి జుట్టూ, గడ్డంతో దేహ మంతా విభూతి రాసుకుని సంచార జీవితం గడిపే ‘అఘోర’ జాతికి చెందిన సాధువులు నరమాంస భక్షకులట. ఈ విషయాన్ని ఇటలీకి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ ఓసినెలీ తెలిపారు. వారి జీవితంపై రీసెర్చ్ చేసేందుకు ఆయన వారిని కలిసాడట. వారితో కొంత కాలం గడిపాడట కూడా. ఈ సందర్భంగా వారి ఫొటోలను కూడా పత్రికలకు విడుదల చేశాడు. కాగా వారు బతికున్న మనుషుల్ని పీక్కుతినరట, కానీ చనిపోయిన వారి మాంసాన్ని మాత్రం ఆరగిస్తారట. మానవ మెదడులో ఉన్న రసాలను తాగేస్తారట. పగలు అఘోరాలుగా పట్టణాల్లో తిరుగుతూ, ధ్యానాలు చేస్తూ తిరిగే వీరు, రాత్రి వేళల్లో స్మశానాల్లో భోజనం చేసి అక్కడే పడుకుంటారట. భోజనమంటే....స్మశానాల్లో కాలుతున్న మృత దేహాల మాంసాన్ని తీసుకుని తింటారట. మానవ శరీరాన్ని తుచ్ఛమైనదిగా, నీచమైనదిగా భావించే వీరు స్వర్గలోక ప్రాప్తిక కాళికను, శివుడిని స్మరిస్తూ ఉంటారు. ఆ దేవతలు రాత్రుళ్ళు స్మశానాల్లోనే సంచరిస్తారని వీరు నమ్ముతారట. అందుకే అక్కడే నిద్రపోతారు. వీరి జాతి 17వ శతాబ్దం నుంచి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెపుతున్నాయి. బాబా కినారమ్ ను వీరు గురువుగా భావిస్తారు. ఆయన 170 ఏళ్ళు బతికినట్టు అఘోరాలు చెపుతుంటారు కూడా.