ఇచ్చినా గుర్తించే స్థితిలో ఆయన లేడు

December 24, 2014 | 11:26 AM | 25 Views
ప్రింట్ కామెంట్

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రకటించే అంశంపై కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ నేత్రుత్వంలోని మంత్రివర్గం ఆయన అధికారిక నివాసం ఈ విషయమై చర్చిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత వాజ్ పేయితోపాటు స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యాలకు కూడా భారతరత్న ప్రదానంపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. భేటీ ముగియగానే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పురస్కారం ప్రకటించినా దాన్ని గుర్తించే స్థితిలో వాజ్ పేయి లేనట్టు కనిపిస్తోంది. దానికి కారణం ఆయనకు అల్జీమర్జ్స్ (మతిమరుపు) వ్యాధి అడ్వాన్స్ స్టేజిలో ఉండటమేనట. చిన్ననాటి స్నేహితుడు అద్వానీని సైతం ఆయన గుర్తించలేని స్థితిలో ఆయన ఉన్నాడట. కనీసం మాట్లడలేని స్థితిలో ఉన్న ఆయనను ఇటీవల ప్రధాని మోదీ పరామర్శించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ