విదేశాల్లో పెంచుకునే కుక్కల్ని అది, ఇది అంటే ఊరుకోరట, ఆడ అయితే ‘షీ’, మగ అయితే ‘హీ’ అని అనాలట, పెంచుకునే యజమానితో ‘ఇట్’ (ఇది) అని కుక్కగురించి ఏదైనా మాట్లాడామనుకోండి... తక్కువ చేశామని తిట్టేస్తారట. అక్కడి వారికి అవి కూడా ఫామిలీ మెంబర్లే. ఇంతకూ ఇదంతా ఎందుకంటే ప్రపంచంలోకి అతి పెద్ద జాగిలం గురించిన ముచ్చట ఇది. ఇతని పేరు హల్క్. కామిక్ హీరో లో హల్క్ గురించి తెలియని పిల్లలు ఉండరు కదా. అందుకే ఇతనికి కూడా అదే పేరు పెట్టారట. హల్క్ బరువు దాదాపు 80 కేజీలు. వయసు 17 నెలలు, ఇంత పెద్ద దేహంతో ఉన్న హల్క్ ముఖం ఖడ్గమృగం లాగే కనిపిస్తుంది కదూ... ఈ జాగిలం ఇంకా పెరగడం ఆగిపోలేదట! రోజుకు నాలుగు పౌండ్ల బీఫ్ సింపుల్ గా లాగించేస్తుందట. న్యూహ్యాంప్ షెయిర్ కు చెందిన మార్లన్, లీసా గ్రేనన్ దంపతులు లు దీన్ని... సారీ.... సారీ... ఇతన్ని పెంచుకుంటున్నారు. వీరి మూడేళ్ళ కొడుకు ఛల్ చల్ హల్క్... అంటూ హార్స్ లా రైడ్ చేస్తాడట హల్క్ మీద. ఇతను ఎలాంటి హానీ చేయడని కూడా అంటున్నారు. నిజానికి యూకేలో పిట్ బుల్స్ చాలా ప్రమాదకరమైనవని దీని సంతానోత్పత్తిని నిలపివేశారట. కానీ గ్రేనన్ హల్క్ తమ ఫామీలీతో చాలా బాగా కలిసిపోయిందని కోర్టును కోరుకుందట.