నిర్భయ నిందితుడిని ఇంటర్వ్యూ చేయాలని ఎందుకనిపించింది? అనిపించిందే అనుకుందాం... మతి లేని ఆయన వ్యాఖ్యలను ఇంటర్వ్యూగా పత్రికలకు ఇవ్వడమూ తప్పే. అంటూ ఇప్పుడు పలువురు మేధావులు విమర్శిస్తున్నారు. ఈ వార్తను చూసిన నిర్భయ తండ్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖేష్ ఇచ్చిన ఇంటర్వ్యూపై ఆయన తీవ్రత స్థాయిలో ధ్వజమెత్తాడు. తన పిల్లలకు తను సొంతగా బతకడం నేర్పాననీ, రాత్రి అమ్మాయి కనిపిస్తే ఇక అంతేనా? దీన్నిబట్టి ముఖేష్ సింగ్ మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని అన్నారు. ఆ నాటి ఈ ఘటనపై దేశం మొత్తం తీవ్రంగా ప్రతి ఘటించి నిర్భయ చట్టం తీసుకువస్తే... ఒక నిందితుడి ఇంటర్వ్యూను పత్రిక ప్రకటించడం ఏమిటని ఆయన దుయ్యబట్టాడు. ఏ మాత్రం విలువల్లేని ముఖేష్ వ్యాఖ్యలు పత్రికల్లో ప్రకటించడం తప్పిదంగా పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.