భారత ప్రభుత్వం తమకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో భారత్ వృద్ధి దిశగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. ‘సమాజ సేవకుగానూ పలువురు ప్రముఖ వ్యక్తులతో పాటు పద్మ అవార్డు తీసుకోబోతుండటం చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇంతటి దేశ అత్యున్నత పురస్కారానికి తమ పేరును ఎంపిక చేసిన సందర్భంగా ప్రభుత్వానికి థాంక్స్ చెబుతున్నాం’ అని ఓ ప్రకటనలో తెలిపారు.