పాత పీఠిక ప్రచురించి మంచి పనే చేశారట

January 28, 2015 | 04:28 PM | 43 Views
ప్రింట్ కామెంట్

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రప్రభుత్వం పత్రికలకి జారీ చేసిన ప్రకటనలో పాత పీఠికనే ప్రచురించడం శివసేన ఆసరాగా తీసుకుని వివాదానికి తెరలేపింది. భారత దేశం ఎప్పుడూ లౌకికదేశం కాదు, మనది హిందూ రాజ్యమే అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ ప్రకటనలో పాత పీఠిక ప్రచురించడంతో లౌకిక, సామ్యవాద పదాలు కనిపించలేదు. పాత రాజ్యాంగ పీఠికను మాత్రమే పొరపాటున ఈ ప్రకటనలో వాడామని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి రాజవర్ధన్ రాథోడ్ వివరణ ఇచ్చారు. అయితే ఇది పొరపాటుకాదు, మంచిపనే చేశారు..పాత రాజ్యాంగపీఠికనే అనుసరించండని శివసేన పార్టీ డిమాండ్ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ