దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళపై పట్టపగలు ఇటుక రాయితో దాడి చేసి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. గోల్ప్స్ లింక్ ప్రాంతంలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో స్కూటీపై వెళ్తుండగా సతీశ్ చంద్ర అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను అడ్డగించాడు. నిబంధనలు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నావంటూ మహిళను ఆపి రూ.200 చలాన్ రాశాడు. అయితే ఆమె రశీదు కోరటంతో ఆగ్రహాంతో ఊగిపోయాడు. నన్నే రశీదు అడుగుతావా అంటూ పక్కనే ఉన్న ఇటుకలను ఆమెపైకి విసరటం ఆరంభించాడు. మహిళ అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి గుంపులుగా చేరుకున్నారు. ఈ వ్యవహారాన్ని దారిన వెళ్లే వాళ్లు తీసిన వీడియో బయటకు రావటంతో కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో క్లిప్ ఆధారంగా కానిస్టేబుల్ పై క్రిమినల్ కేసు నమోదైంది.