ఫస్ట్ టైం: ముస్లిం వ్యక్తి రెండో పెళ్లిని కోర్టు అడ్డుకుంది!!

June 06, 2015 | 12:27 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bombay_family_court_stops_muslim_second_marriage_niharonline

భారత న్యాయవ్యవస్థలో ఓ చరిత్రాత్మక తీర్పు వెలువడింది. పోషించే స్తోమత లేకుండా కేవలం మతం పేరు చెప్పుకుని రెండో పెళ్లిచేసుకోబోయిన ఓ ముస్లిం వ్యక్తిని నిలువరించింది ముంబై ఫ్యామిలీ కోర్టు. బాధితురాలు వేసిన పిటిషన్ విచారించిన జస్టిస్ స్వాతీ చౌహన్ ఈ తీర్పు వెలువరించారు. 2001 లో వివాహమైన తర్వాత  నివాస నిమిత్తం యూఎస్ కు వెళ్లిన ఓ ముస్లిం జంటకు నాలుగు నుంచి 12 సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలున్నారు. 45 ఏళ్లున్న తన భర్త 18 నుంచి 25 ఏళ్లలోపు అమ్మాయి కావాలని ఇచ్చిన ప్రకటన చూసి షాక్ తిన్న ఆ భార్య కోర్టునాశ్రయించింది. తన అనుమతి లేకుండా మరో పెళ్లి కోసం తన భర్త ప్రయత్నిస్తున్నాడని, ఇంట్లోంచి వెళ్లిపోమంటున్నాడని, తన ప్రయోజనాలు చూసేవరకు మరో పెళ్లి కోసం ప్రయత్నించకుండా ఆదేశాలు జారీచేయాలని ఆమె వాదించింది. అయితే భర్త మాత్రం తన భార్య తలాక్ చెప్పేసిందని, కాబట్టి తనకు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే హక్కు ఉందని వాదించాడు. ఈ కేసులో పలు రికార్డులు, ముస్లిం చట్టాలను పరిశీలించిన న్యాయమూర్తి, చాలా జాగ్రత్తలతో తీర్పు చదివారు. ముస్లిం చట్టాల ప్రకారం రెండో వివాహానికి అనుమతి ఉన్నా, రెండో వివాహంతో మొదటి భార్యకు అన్యాయం జరిగేట్లుంటే దాన్ని ఆపవచ్చని సురాహ్ నిసాలో ఉందని కోర్టు తెలిపింది. ఇద్దరినీ సమానంగా చూసేలా ఉండాలని, పోషించే సత్తా ఉ:టేనే రెండో వివాహానికి అర్హుడని న్యాయమూర్తి తీర్పిచ్చారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ