అలర్ట్ : డేటింగ్ సైట్లతోనే డేంజర్ రోగాలు వ్యాపిస్తున్నాయి

June 04, 2015 | 12:38 PM | 0 Views
ప్రింట్ కామెంట్
online_dating_sites_causes_hiv_niharonline

రండి బాబూ రండి... మీ అభిరుచికి తగిన జోడినీ వెతుక్కొండి. అంటూ ఆన్ లైన్ డేటింగ్ సైట్లు వల విసురుతుంటాయి. అలాంటి సైట్లలో తెలుసుకునే విషయమిది. ఈ సైట్లు జేబుకు చిల్లు పెట్టడమే కాదు ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. పరస్పర అంగీకారంతో శృంగారానికి వీలు కల్పించే ఈ సైట్లు, తద్వారా హెచ్ఐవీ, ఇతర సుఖ వ్యాధుల కారక వైరస్ లను వ్యాపింపజేస్తున్నాయని అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రోఫెసర్ రీతూ అగర్వాల్ చెబుతున్నారు. నాలుగేళ్ల ఫ్లోరిడాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య 13.5 శాతం పెరుగుదలకు క్రెయిగ్ లిస్ట్ అనే అడల్ట్ డేటింగ్ సైటే కారణమని అధ్యయనం చెబుతోంది. ఈ సైట్ లో కలిసిన భాగస్వాముల ద్వారానే అత్యధికులకు హెచ్ఐవీ సోకినట్లు వెల్లడైందట.  ఇలాంటి సైట్లు వ్యక్తిగత జీవితాన్ని మొత్తం మార్చేయవచ్చని, ప్రజారోగ్య విభాగం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అగర్వాల్ సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ